Nail Polish: గోళ్లను అందంగా మార్చుకోవడానికి నెయిల్ పాలిష్ ఉపయోగిస్తారు. అది మీ గోళ్లను పాడు చేస్తుందని చాలామందికి తెలియదు. దీన్ని ఉపయోగించడం వల్ల మీకు చాలా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే.. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మీకు హాని కలిగించవచ్చంటున్నారు. చాలా మంది అమ్మాయిలు గోళ్లను అందంగా మార్చుకోవడానికి నెయిల్ పాలిష్ వాడుతుంటారు. అయితే నెయిల్ పాలిష్ వాళ్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నెయిల్ పాలిష్ వాళ్ల వచ్చే సమస్యలు:
- గోళ్లపై ఎక్కువ నెయిల్ పాలిష్ వేయడం వల్ల చాలా హాని కలుగుతుంది. ఇది నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
- నెయిల్ పాలిష్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు శరీరంతో కలుస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థకు హాని కలిగిస్తుంది.
- నెయిల్ పాలిష్‌లో టోలున్ అనే మూలకం ఉంటుంది. ఇది కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది.
- అక్రిలేట్స్ అనే రసాయనాన్ని నెయిల్ పెయింట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.
- నెయిల్ పెయింట్ ఎక్కువగా వేయడం వల్ల గోళ్లు బలహీనంగా మారి క్రమంగా వాటి మెరుపు కూడా మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: డీహైడ్రేషన్‌ను నివారించాలనుకుంటే.. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!