పాక్ ఆపద్దర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణం...!

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాకర్ ప్రమాణ స్వీకారం గురించి అధ్యక్ష కార్యాలయం ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 ఏ కింద కాకర్ ను ఆపద్దర్మ ప్రధానిగా అధ్యక్షుడు అరీఫ్ అల్వీ నియమించారని ట్వీట్ లో పేర్కొంది. కాకర్ 2018లొ బలూచిస్తాన్ అవామీ పార్టీ నుంచి తొలిసారిగా సెనెటర్ గా ఎన్నికయ్యారు.

author-image
By G Ramu
పాక్ ఆపద్దర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ ప్రమాణం...!
New Update

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్తామాబాద్ లోని ఐవాన్ ఇ సదర్(పాక్ అధ్యక్ష భవనం)లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అధ్యక్ష భవనంలో అన్వరుల్ హక్ తో పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. దీంతో పాక్ లో ఆపద్దర్మ ప్రధానిగా చేసిన ఎనమిదవ వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు కేబినెట్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసీమ్ మునీర్, స్టాఫ్ కమిటీ జాయింట్ చీఫ్స్ జనరల్ షాహిద్ శంషద్ మిర్జా, సెనెట్ చైర్మన్ సాదీఖ్ సంజ్రానీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు సెనేట్ పదవికి రాజీనామా చేస్తూ కాకర్ ఇచ్చిన లేఖను సెనెట్ చైర్మన్ సాదీఖ్ సంజ్రానీ ఆమోదించారు.

కాకర్ ప్రమాణ స్వీకారం గురించి అధ్యక్ష కార్యాలయం ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 ఏ కింద కాకర్ ను ఆపద్దర్మ ప్రధానిగా అధ్యక్షుడు అరీఫ్ అల్వీ నియమించారని ట్వీట్ లో పేర్కొంది. కాకర్ 2018లొ బలూచిస్తాన్ అవామీ పార్టీ నుంచి తొలిసారిగా సెనెటర్ గా ఎన్నికయ్యారు. అంతకు ముందు ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కు అధికార ప్రతినిధిగా పని చేశారు.

ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేశారు. దీంతో పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) రద్దు అయింది. దీంతో ఆపద్దర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ పేరును ఖరారు చేస్తూ అఖిల పక్ష సమావేశంలో నేతలు తీర్మానం చేశారు. తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

#pak-president #senetor #pak-care-taker-pm #anwar-ul-hua #swearing-ceremony #shahabaj-shareef
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe