Antarctica: ప్రమాదంలో అంటార్కిటికా! అంటార్కిటికా భూభాగంలో వ్యాపించిన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదంగా వ్యాప్తిచెందుతుందని చిలీలోని కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకురాలు ఫాబియోలా లియోన్ తెలిపారు By Durga Rao 16 Mar 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి అంటార్కిటికా భూభాగంలో వ్యాపించిన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదంగా వ్యాప్తిచెందుతుందని చిలీలోని కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకురాలు ఫాబియోలా లియోన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దక్షిణ అమెరికాలోని పక్షి ,సముద్ర క్షీరదాలను నాశనం చేసిన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి, అంటార్కిటికాలోని జెయింట్ పెంగ్విన్ కాలనీపై దాని ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్‌లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు. 2023 చివరిలో 2024 ప్రారంభంలో అంటార్కిటికాలో బర్డ్ ఫ్లూ ని చిలీలోని కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకురాలు ఫాబియోలా లియోన్ పరిశీలించారు. పాజిటివ్ కేసుల్లో తొమ్మిది అడెలీ పెంగ్విన్‌లు , అంటార్కిటిక్ కార్మోరెంట్‌లను గుర్తించామని లియోన్ తెలిపారు. "అత్యధిక వ్యాధికారక H5N1 ఇన్ఫ్లుఎంజాను గుర్తించడం అంటార్కిటిక్ పెంగ్విన్‌లు , కార్మోరెంట్‌లలో మొదటిసారిగా నివేదించబడిందని" లియోన్ చెప్పారు, పెంగ్విన్ కాలనీల రద్దీ స్వభావం, వలసలు వైరస్ వ్యాప్తిని మరింత దిగజార్చగలవని హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ కేసులు భారీ సంఖ్యలో ఉన్న దక్షిణ అమెరికాకు వలస వెళ్లిన పక్షుల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించిందని లియోన్ వెల్లడించారు . #antarctica #penguin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి