BREAKING: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ట్విస్ట్.. తాను అప్రూవర్‌గా మారలేదన్న అరుణ్‌ పిళ్లై!

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. తాను అప్రూవర్‌గా మారలేదని అరుణ్‌ పిళ్లై బాంబు పేల్చారు. అప్రూవర్‌గా మారానన్న వార్తలను అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఖండించారు. సెక్షన్ 164 కింద అరుణ్‌ పిళ్లై ఎలాంటి వాంగ్మూలం  ఇవ్వలేదని.. పిళ్లైపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తరుపు లాయర్లు చెప్పారు.

BREAKING: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ట్విస్ట్.. తాను అప్రూవర్‌గా మారలేదన్న అరుణ్‌ పిళ్లై!
New Update

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. తాను అప్రూవర్‌గా మారలేదని అరుణ్‌ పిళ్లై బాంబు పేల్చారు. అప్రూవర్‌గా మారానన్న వార్తలను అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఖండించారు. సెక్షన్ 164 కింద అరుణ్‌ పిళ్లై ఎలాంటి వాంగ్మూలం  ఇవ్వలేదని.. పిళ్లైపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తరుపు లాయర్లు చెప్పారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు ​జారీ చేసింది. కవితకు సమన్లు​జారీ చేయడంతో చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కదలిక కనిపిస్తోంది. శుక్రవారం ఢిల్లీకి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కవిత గత మార్చిలో మూడుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారినట్టు కథనాలు వచ్చాయి. అయితే అవి తప్పుడు ప్రచారమని పిళ్లై తరుఫు లాయర్లు చెబుతున్నారు.

మరికొన్ని రోజుల్లో మరింత హీట్?
పిళ్లై నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరిగింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై దర్యాప్తు సంస్థ కవిత బినామీగా అభియోగాలు మోపింది . సౌత్ గ్రూప్‌లోని చాలా మంది సభ్యులు ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్‌లుగా మారారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి శరత్‌చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా మద్యం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

పిళ్లైతోనే మొత్తం లాగుతారా?
సౌత్ గ్రూప్ తరపున ఢిల్లీలోని పలు పార్టీలకు పిళ్లై కిక్‌బ్యాక్ ఆఫర్ చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆరోపించారు. కిక్‌బ్యాక్ అందుకున్న వారిలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎం. రాఘవ రెడ్డి, కె. కవిత ఉన్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా, పిళ్లైకి అభిషేక్ బోయినపల్లి ఆడిటర్ జి. బుచ్చిబాబుతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో ఎల్1 లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్‌లో అరుణ్ పిళ్లైకి 32.5 శాతం వాటా ఉంది. 32.5 శాతం వాటా ఉన్న ప్రేమ్ రాహుల్, కె. కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి బినామీ పెట్టుబడులకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ తెలిపింది. ఢిల్లీలోని తయారీదారులు, టోకు వ్యాపారులు మరియు బహుళ రిటైల్ జోన్‌ల కార్టెల్‌ను ఏర్పాటు చేయడంలో అరుణ్ పిళ్లై కీలక పాత్ర పోషించారని ED ఆరోపించింది.

ALSO READ: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌.. 40 మందికి అస్వస్థత

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe