/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/raviteja-jpg.webp)
Raviteja: రవితేజ సొంత బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్. ఈ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. రీసెంట్ గా వచ్చిన మట్టి కుస్తీ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. సుందరం మాస్టారు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సినిమాను రెడీ చేశాడు నిర్మాత రవితేజ.
రవితేజ నిర్మాతగా ‘ఛాంగురే బంగారురాజా’ అనే సినిమా రాబోతోంది. ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశారు.
E week cinemalu chusara?
Enti next week Telugu cinema ledhu anukuntunnara!!#ChangureBangaruRaja tho mana boys vachesthunaru ee 15th September na :))) Kaludham Theaters lo 🤗#CBROnSEP15th@KarthikRathnam3@GoldieNissy@krishnasaurabhS@RTTeamWorks@fbf_picturespic.twitter.com/sGrgHfrAKo
— Ravi Teja (@RaviTeja_offl) September 9, 2023
సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవులు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఆ తేదీకి చాలా పోటీ ఉంది. విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ రిలీజ్ అవుతోంది. ఇక రామన్న యూత్ అనే మరో సినిమా కూడా ఉంది. ఇప్పుడు వాటికి పోటీగా ఛాంగురే బంగారురాజా రెడీ అవుతోంది. ఇది ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి.
‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం ఇందులో హీరోగా నటించగా.. గోల్డీ నిస్సీ హీరోయిన్ గా పరిచయమౌతోంది. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్ ఇదివరకే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చాడు.