Chandrababu: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది.  ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసింది. చంద్రబాబును విచారించాలని కోరింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది.

New Update
Chandrababu: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్

Chandrababu in Inner Ring Road Case: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది.  ఏసీబీ కోర్టులో అమరావతి (Amaravati) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ వేసింది. ఈ కేసులో చంద్రబాబును విచారించాలని కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేష్‌ (Lokesh) పేర్లను సైతం పొందుపరిచింది. ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేష్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మే 10న ఏపీ సీఐడీకి (AP CID) ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 420, 166, 34, 26, 37, 120 బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది కలిగించేలా ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్స్ మార్చారని రామకృష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!

మరోవైపు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్రా (Lawyer Sidharth Luthra) వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ (TDP) కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు

Advertisment
తాజా కథనాలు