Drugs: హైదరాబాద్ ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ దందా అంత తొందరగా వీడేలా లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న డ్రగ్స్ ముఠాలు తమ పద్ధతులు మార్చుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో (Hyderabad) డ్రగ్స్ అమ్ముతున్న మరో ముఠా పట్టుబడింది. ఇటీవల నార్సింగి డ్రగ్స్ కేసులో ఆర్టిస్ట్ లావణ్య (lavanya) , కోకాపేట్ (kokapet) ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్టయిన విషయం తెలిసిందే. శనివారం మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఆరుగురి అరెస్ట్..
మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ పబ్బుల్లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న క్రమంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి.. మదాపూర్ నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్ క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి : Deep Fake : టెక్నాలజీ తప్పేమీ లేదు.. అంతా మన దగ్గరే ఉంది: కృతి కామెంట్స్ వైరల్
10 గ్రాముల ఎండీఎంఏ..
ఈ మేరకు పబ్ లపై దాడులు నిర్వహించి వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ తో పాటు కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పట్టుబడిన వారిలో మిథున, కొంగాల ప్రియ అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు మరో నలుగురితో కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు. డగ్స్ సప్లయర్స్ ఉస్మాన్ , అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు. కాగా ఈ కేసులో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.