మణిపూర్‎లో చల్లారని హింస, నిరసనకారులు, ఆర్మీ మధ్య కాల్పులు..!!

ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాజాగా మరోసారి హింస చెలరేగింది. నిరసనకారులు, ఆర్మీ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని కాల్పులకు తెగబడిన దుండగులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రం ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

New Update
మణిపూర్‎లో చల్లారని హింస, నిరసనకారులు, ఆర్మీ మధ్య కాల్పులు..!!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్నాళ్లుగా అక్కడ రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ హింసకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. తాజాగా బుధవారం రాత్రి కూడా మరోసారి హింస చెలరేగింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని నార్త్ బోల్జాంగ్‌లో గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, కాల్పులు జరిపినవారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

assam rifles

బుధవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని YKPIకి ఉత్తరాన ఉరంగపట్ సమీపంలో కాల్పులు జరిగాయి. మూలాల ప్రకారం, బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో హరోథెల్ వైపు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 24న న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ముఖ్యమైన అంశంపై జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో అధికార, అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో చర్చిస్తారని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు.

మే 3 నుండి మణిపూర్‌లో మెయిటీ కమ్యూనిటీ, కుకీ గిరిజన ప్రజల మధ్య నిరంతర హింస జరుగుతోంది. మెయిటీ కమ్యూనిటీ ప్రజలకు షెడ్యూల్డ్ తెగ హోదా డిమాండ్పై వివాదం మొదలైంది. ఈ కుల హింసలో ఇప్పటివరకు 120 మందికి పైగా చనిపోగా, మూడు వేల మందికి పైగా గాయపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు