కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత సూరజ్‌ మృతి..5 నెలల్లో 8వ మరణం..!

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన చిరుతల మరణాల పరంపర ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది. చిరుత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో కునో నేషనల్ పార్క్‌లో గడిచిన నెలల్లో ఇప్పటివరకు ఎనిమిది చిరుతలు చనిపోయాయి.

New Update
కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత  సూరజ్‌ మృతి..5 నెలల్లో 8వ మరణం..!

కునో నేషనల్ పార్క్‌లోశుక్రవారం మరో చిరుత మరణించింది. దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకువచ్చిన మగ చిరుత సూరజ్ మృతి చెందింది. కునో నేషనల్ పార్కులో గత ఐదునెలల్లో మొత్తం 8 చిరుతలు మరణించాయి. ఏడో చిరుత మరణించిన కొద్ది రోజులకే ఈ మగ చిరుత మరణించడం విషాదకరం.

publive-image

అయితే ఈ చిరుత ఎందుకు మరణించిందో కారణాలను ఇంకా అధికారులు వెల్లడించలేదు. ఐదు నెలల్లో మరణించిన 8వ చిరుత ఇది. సూరణ్ చిరుత మరణాంతరం కునో నేషనల్ పార్కులో ఇంకా 10 చిరుతలు మాత్రమే మిగిలాయి. గతమంగళవారం తేజస్ అనే చిరుత గాయాలతో మరణించిన విషయం తెలిసిందే.

కునో మేనేజ్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11 గంటలకు, మానిటరింగ్ బృందం మగ చిరుత తేజస్ మెడ పైభాగంలో గాయం గుర్తులను గమనించింది. ఈ సమాచారాన్ని వన్యప్రాణి వైద్యులకు అందించారు. తేజస్‌కు మత్తుమందు కింద చికిత్స అందించారు, కానీ కొన్ని గంటల తర్వాత చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

కొన్ని నెలల క్రితం నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు. కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని మోడీ కొన్ని చిరుతలను విడుదల చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది, కానీ అవన్నీ చనిపోయాయి. కునో నేషనల్ పార్క్‌లో ఇప్పుడు 10 చిరుతలు మిగిలి ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు