Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్

AP: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. కోర్టు విచారణకు హాజరు అయ్యే సమయంలో తనను కొట్టాడని టీడీపీ నేత శివ ఫిర్యాదు ఇచ్చారు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్‌.. పోలీసు కస్టడీకి పర్మిషన్
New Update

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. టీడీపీ కార్యకర్త కొమెర శివ ఫిర్యాదుతో మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఈ నెల 26వ తేదీన మాచర్ల కోర్టుకు పిన్నెల్లి హాజరయ్యారు. కోర్టుకు హాజరవుతున్న సమయంలో పిన్నెల్లికి టీడీపీ నేత కొమెర శివ ఎదురుపడ్డారు. మరుక్షణమే తన చేత్తో కొమేర శివ కడుపులో గుద్దారు పిన్నెల్లి. అకారణంగా తనను దూషించి తనపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొమెర శివ. శివ ఫిర్యాదుతో పాటు పిన్నెల్లి దాడి చేస్తున్న వీడియోను ఆధారం చేసుకుని సెక్షన్ 323 క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.

#pinnelli-ramakrishna-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe