తమిళిసైతో అన్నామలై భేటీ..!

చెన్నైలోని సాలి గ్రామంలోని తమిళిసై నివాసంలో అన్నామలై ఆమెతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అన్నామలై,తమిళి సై ఎక్స్ ద్వారా తెలిపారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం లో అన్నామలై విషయమై అమిత్ షా తన పై ఆగ్రహం వ్యక్తం చేయలేదని,సలహా ఇచ్చారని ఇప్పటికే ఆమె తెలిపింది.

New Update
తమిళిసైతో అన్నామలై భేటీ..!

చెన్నై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చెన్నై సాలిగ్రామంలోని  తమిళిసై తన నివాసంలో ఆమె ను కలిశారు. అమిత్ షా తనను మందలించలేదని, సలహా ఇచ్చారని తమిళిసై ఇప్పటికే తన ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేశారు. మరి ఈ భేటీతో వీరిద్దరి మధ్య వివాదానికి తెరపడుతుందని బీజేపీ నేతలు ,కార్యకర్తలు భావిస్తున్నారు.

ఆ తర్వాత అన్నామలై తన ఎక్స్ పేజ్‌లో తమిళనాడులో కమలం వికసిస్తుందని భరోసా ఇస్తూ.. అందుకు కృషి చేసిన వ్యక్తి తమిళిసై, రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ అభివృద్ధికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పోస్ట్ చేశారు.ఆ తర్వాత కొద్ది సమయానికి తమిళ సై కూడా అన్నామలై తో కలసి దిగిన ఫోటో ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు