/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-03T125548.546-jpg.webp)
Tripti Dimri: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి పై కూడా అంతే బజ్ నడిచింది. జోయా పాత్రలో ఆకట్టుకున్న త్రిప్తి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. సినిమాలో హీరోయిన్ కంటే కూడా ఈ బ్యూటీ ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. యానిమల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రిప్తి.. ఇప్పుడు కుర్రాళ్ళ నేషనల్ క్రష్ గా మారింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిప్తి రిలేషన్ షిప్ గురించి నెట్టింట్లో చర్చ మొదలైంది. త్రిప్తి వ్యాపార వేత్త సామ్ మర్చంట్ ను డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఇటీవలే ఒక వెడ్డింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను త్రిప్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిలో సామ్ మర్చంట్ తో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో వారిద్దరూ రిలేషన్ షిప్ గురించి నెట్టింట్లో చర్చ మొదలైంది.
Also Read: Pushpa 2: ‘ఈ సారి రూల్ పుష్పదే’.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
గతంలో త్రిప్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తమ్ముడు కర్నేష్ శర్మతో రిలేషన్ షిప్ ఉన్నారు. రీసెంట్ గా వీరిద్దరూ వారి రిలేషన్ షిప్ కు బ్రేక్ అప్ అయిన తర్వాత.. ప్రస్తుతం ఈ బ్యూటీ సామ్ మర్చంట్ తో రిలేషన్ లో ఉన్నట్లు టాక్ నడుస్తుందో. కానీ త్రిప్తికి సంబంధించిన కొన్ని సన్నిహిత వర్గాలు ఈ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. మరి సామ్, త్రిప్తి నిజంగానే డేటింగ్ లో ఉన్నారా..? లేదంటే అవి గాసిప్స్ మాత్రమేనా ..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Gopichand : న్యూ ఇయర్ కు హీరో గోపి చంద్ బిగ్ అప్డేట్.. ఏంటో తెలుసా..!