Wedding card: నీ ఐడియాకు హ్యాట్సాఫ్‌ బ్రో.. ఈ సిద్దిపేట కుర్రాడి పెళ్లి కార్డు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

సిద్ధపేట జిల్లాకు చెందిన అనిల్‌ అనే టీచర్‌ తన పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. క్వశ్చన్‌ పేపర్‌ తరహాలో పెళ్లి కార్డును ప్రింట్‌ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Wedding card: నీ ఐడియాకు హ్యాట్సాఫ్‌ బ్రో.. ఈ సిద్దిపేట కుర్రాడి పెళ్లి కార్డు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

రొటిన్‌గా ఆలోచిస్తే లైఫ్‌ బోర్‌ కొడుతుంది. అందరిలాగే థింక్‌ చేస్తే జీవితంలో జిల్‌జిల్‌జిగా ఉండదు. ఎప్పుడైనా కొత్తగా... వెరైటీగా ఆలోచించి ఆ పనిని ఆచరణలో పెడితే ప్రపంచం మనల్ని ఫాలో అవుతుంది. అందుకే ట్రెండ్‌ ఫాలో అవ్వకూడదు.. ట్రెండ్‌ సెట్ చేయాలంటాడు పవన్ కళ్యాణ్‌. ఈ మధ్యకాలంలో పెళ్లి కార్డులను వెరైటీగా డిజైన్ చేయించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో రాజమండ్రికి చెందిన ఓ జంట రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ ప్రింట్ చేసింది.. మరికొందరు పెళ్లికి రాకపోయిన పర్వలేదు కానీ.. గిఫ్ట్ డబ్బులు మాత్రం స్కాన్‌ చేయిండంటూ కార్డులోనే యూపీఐను ప్రింట్‌ చేస్తున్నారు. ఇంకొందరు తెలంగాణ యాసతో శుభలేఖను అచ్చు వెయిస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూడబోయే పెళ్లి కార్డు మాత్రం నెవర్‌ బిఫోర్‌.. మీ ఐక్యూ లెవల్స్‌ను దాటేసే వెడ్డింగ్‌ కార్డు ఇది. అదేంటో తెలుసుకోండి.

publive-image అనిల్ ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్

సిద్దిపేట జిల్లా(siddhipet district) చెందిన అనిల్‌ టీచర్‌గా జాబ్‌ చేస్తున్నాడు. అతనికి టీచర్‌ వృత్తి అంటే ఎంతో అమితమైన ప్రేమ. పెళ్లిలోనూ తన టీచర్‌ మార్క్‌ కనిపించాలని ఆలోచించాడు. తన కెరీర్‌లో ఎన్నోసార్లు క్వశ్చన్‌ పేపర్‌ను సెట్ చేసిన అనిల్‌కు అదిరిపోయే ఐడియా వచ్చింది. తన క్రీయేటివ్‌ బ్రెయిన్‌కు సానబెట్టిన అనిల్‌ తన పెళ్లి కార్డు(Wedding card)ను వెరైటీగా డిజైన్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మల్టిపుల్‌ ఛాయిస్‌, బ్లాంక్స్‌, మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌:
అనిల్, అక్షరల పెళ్లి ఈ నెల 19న సిద్దిపేటలో జరగనుండగా.. బంధుమిత్రులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకి క్వశ్చన్‌ పేపర్‌ స్టైల్‌లో పెళ్లి కార్డును ప్రింట్ చేయించాడు. ఇందులో అబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్స్‌తో పాటు మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌, ట్రూ ఆర్‌ ఫాల్స్‌ టైప్‌ క్వశ్చన్స్‌ కూడా ఉన్నాయి. వాటికి ఆన్సర్లు కూడా అందులోనే ఉన్నాయి. కళ్యాణ మండపం వేదిక నుంచి పెళ్లి ముహూర్తం వరకు ఫిల్‌ ఇన్ ది బ్లాంక్స్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ టైపులో ఆన్సర్లు ఇచ్చారు. ఇక మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌లో పెయిర్స్‌ను పెట్టడం మరింత వెరైటీగా అనిపించింది.

Also Read: ఏపీలో మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు జాతరే జాతర..!

Watch: 

Advertisment
తాజా కథనాలు