షకిబ్‌కు రాళ్ల దెబ్బలు తప్పవు.. మాథ్యూస్‌ సోదరుడు సీరియస్ వార్నింగ్

శ్రీలంక సీనియర్‌ ఆటగాడు మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశానికి వస్తే రాళ్లతో కొడతామంటూ తీవ్రంగా హెచ్చరించాడు. జెంటిల్మన్‌ గేమ్‌లో క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

New Update
షకిబ్‌కు రాళ్ల దెబ్బలు తప్పవు.. మాథ్యూస్‌ సోదరుడు సీరియస్ వార్నింగ్

శ్రీలంక సీనియర్‌ ఆటగాడు మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశానికి వస్తే రాళ్లతో కొడతామంటూ తీవ్రంగా హెచ్చరించాడు. జెంటిల్మన్‌ గేమ్‌లో క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలు విషయానికొస్తే వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 'టైమ్‌డ్‌ ఔట్' వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ వ్యవహరించిన తీరుపై శ్రీలంక సీనియర్‌ ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ అనంతరం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట స్థాయిని దిగజార్చుకున్నాడని షకిబ్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. తాజాగా మాథ్యూస్‌ సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌తోపాటు ఆ జట్టు సభ్యుల నుంచి ఇంతకంటే మరేం ఆశించలేమని పేర్కొన్నాడు.'మాథ్యూస్‌ ఔట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. గెలుపోటములు తర్వాతి విషయం. కానీ, జెంటిల్మన్‌ గేమ్‌లో బంగ్లా కెప్టెన్ షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. అయితే, ఇలాంటివి షకిబ్‌తోపాటు ఆ జట్టు నుంచి వస్తాయని మేం కూడా ఆశించలేదు. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి. లేదా అభిమానుల నుంచి వేధింపులూ తప్పవు' అంటూ తనదైన స్టైల్ ఫైర్ అయ్యాడు.

Also read :నీతీశ్‌ వ్యాఖ్యలపై మేరీ మిల్బెన్‌ ఫైర్‌.. బిహార్‌కు మహిళా సీఎం కావాలంటూ

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ లో మాథ్యూస్‌ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో బంగ్లా జట్టు 'టైమ్‌డ్‌ ఔట్‌' కోసం అప్పీల్‌ చేసింది. దీంతో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్‌డ్‌ ఔట్‌ మాథ్యూస్‌ వెనుదిరగాల్సి వచ్చింది. హెల్మెట్‌ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్‌ వివరించినా అంపైర్ల నిర్ణయం మారలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడు ఇలా 'టైమ్‌డ్‌ ఔట్‌' అవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు