'మమ్మల్ని మీరు పీకేస్తే.. మేం మిమ్మల్ని పీకేస్తాం'.. అంగన్వాడీల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల ఆందోళన ఉదృతం అవుతోంది. మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మమ్మల్ని ఉద్యోగం నుంచి పికేస్తే.. మేము మిమ్మల్ని అధికారంలోంచి పీకేస్తామంటూ వైసీపీ నాయకులను హెచ్చరించారు.

New Update
'మమ్మల్ని మీరు పీకేస్తే.. మేం మిమ్మల్ని పీకేస్తాం'.. అంగన్వాడీల హెచ్చరిక.!

Anganwadis protest: అంబెద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీల ఆందోళన రోజు రోజుకు ఉదృతం అవుతోంది. పి.గన్నవరం తహశీల్దార్ కార్యాలయం వద్ధ 6వ రోజు అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనల కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఆందోళనలు చేస్తున్న వారిని తీసేస్త అనడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్

మమ్మల్ని మీరు అంగన్వాడీ ఉద్యోగాల నుండి పీకేస్తే..మేం మిమ్మల్ని అధికారంలో నుండి పీకేస్తాం అంటూ అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేపట్టారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్నారు. అహంకారంతో పాలన చేస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే మీ పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


Also Read: ఒంగోలులో ఇసుక టిప్పర్ బీభత్సం.. ముక్కలు ముక్కలైన లెక్చరర్

కాగా, అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి). మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. న్యాయబద్దంగా వారి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే బెదిరింపులకు దిగడం దుర్మర్గం అన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చమంటే బెదిరింపులకు దిగుతారా? అంటూ ధ్వజమెత్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వి.

Advertisment
తాజా కథనాలు