NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రెండో రోజు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శావల దేవదత్ తోపాటు నాయకులు సైతం పాల్గొని నిరసన తెలిపారు.
Also Read: శ్రీనాధ్ ను చంపేసింది భార్యేనా? హత్య వెనుక ఇంత పెద్ద కారణముందా?
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుశీల మాట్లాడుతూ..జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీ వర్కర్లకు తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తాను అని వాగ్దానం చేశారని దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న బాలింతలను, చిన్నపిల్లలను మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్లకు మేము సేవలు చేస్తుంటే.. మీరు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వణికిస్తున్న పెద్దపులి సంచారం.. పశువుల కాపరిపై దాడి.!
ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శావల దేవదత్ మాట్లాడుతూ..అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చాలా సేవలు చేస్తున్నారని, వాళ్ళ కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబద్దపు హమీలతో గద్దెనెక్కిన జగన్ అంగన్వాడీల సమస్యను నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.అంగన్వాడీ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రూ. 26 వేల కనీస వేతనం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయమైన కోరికలను తీరుస్తామని హామీ ఇచ్చారు.