Adilabad: జుట్టు పట్టుకొని SIను ఈడ్చుకెళ్లిన అంగన్‌వాడీలు..!! ఆదిలాబాద్ కలెక్టరేట్(adilabad collectorate) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు అంగన్‌వాడీలు(anganwadi workers) ఆందోళన చేపట్టారు. పోలీసులు(Police), నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI)ని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. పరిస్ధితి ఉద్రిక్తం కావడంతో పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. By Jyoshna Sappogula 20 Sep 2023 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సైని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. పరిస్ధితి ఉద్రిక్తం కావడంతో పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వేతనాల పెంపు, ఖాళీల భర్తీ, నిధుల కేటాయింపు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి అంగన్‌వాడీలు పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో కలిసి అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సైని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. అక్కడి నుంచి ఆమెను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న ఆమె జుట్టు ముడివేసుకుని తిరిగి విధులు నిర్వర్తించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ స్టేషన్‌కి తరలించారు. దీంతో అక్కడ కూడా వారు ఆందోళన కొనసాగించారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. వేతనాల పెంపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిటైర్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీలు 10 రోజులుగా విధులు బహిష్కరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల కోసం సమ్మెను చేపట్టారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పాలసీలో రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లుగా నిర్ధారించారు. పదవీ విరమణ పొందిన టీచర్‌కు రూ.లక్ష, హెల్పర్‌కు రూ.50వేల చొప్పున ఆర్థికసాయం, ఆసరా పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్‌వాడీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి