రానున్న పదేళ్లలోపు విశాఖ - విజయవాడ ఈ రూట్ లో బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ముంబాయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టించేందుకు స్పీడ్ గా పనులు కొనసాగుతున్నాయి. 2026 ఆగస్టు వరకు సూరత్, బిలిమోరా మధ్య 63 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ప్రయోగాత్మకంగా నడవనుంది.
ప్రజల ప్రయాణ సౌకర్యార్థం విశాఖపట్నం-విజయవాడ నగరాల మధ్య త్వరలోనే బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ ద్వారా 75 నిమిషాల్లోనే విశాఖ నుంచి విజయవాడకు వచ్చే అవకాశం ఉంటుంది.. ఇది కేంద్రం ప్రణాళిక. ఇందుకు మరో పదేళ్ల లోపు నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దేశంలో ముంబై-అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ నడిచేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపు రూ.1.25 లక్షల కోట్లు కాగా.. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ రుణం అందిస్తుంది.. మిగిలిన ఖర్చు భారత ప్రభుత్వం భరిస్తుంది.
ఢిల్లీ-ముంబై, చెన్నై-కోల్‌కతా, ముంబై-చెన్నై, కోల్ కొతా – ఢిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయడం వల్ల హై-స్పీడ్ తో రైళ్ల డైమండ్ చతుర్బుజి ఏర్పడుతుంది. ఢిల్లీ-చెన్నై, ముంబై- కోల్ కొతా రూట్ల మధ్య హై స్పీడ్ రైల్ ని నడిపించాలని రైల్వే శాఖ కొంతకాలంగా ప్లాన్ చేస్తుంది. ఈ రెండు మార్గాలు చతుర్బుజానికి కర్ణంలా ఉంటాయి.. ట్రైన్ నెట్ వర్క్ ఈ మార్గాల్లో స్పీడ్ పై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి అన్న విషయంపై రైల్వే శాఖ అధ్యయనం చేస్తుంది. ఒకవేళ ఈ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ నడిస్తే గనకా.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కేంద్రం పక్కాగా ప్లాన్ అమలు చేస్తే.. కొన్ని సంవత్సరాల్లోనే విజయవాడ- విశాఖ నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ అందుబాటు లో వస్తే కేవలం 75 నిమిషాల్లోనే విజవాడ నుంచి విశాఖ పట్టణానికి చేరుకునే ఛాన్స్ ఉంటుంది.