పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను వాలంటీర్లు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించడం దారుణమని దుయ్యబట్టారు. వాలంటీర్ల గురించి తెలియని పవన్‌ కల్యాణ్‌ రాజకీయ స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

New Update
పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి వాలంటీర్ల వ్యవస్థల గురించి తెలుసుకోకుండా అనాలోచిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి రోజా హెచ్చరించారు. వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఏపీలో 15వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే రెండు లక్షల 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. వీరిలో సగం మంది మహిళా వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన రోజుల్లో నిరంతరంగా నీ మీద ఈనాడు, టీవి5, టీడీపీ ఛానళ్లలో టెలీకాస్ట్ చేశారని వాపోయావు కదా ఇప్పుడేం అయ్యిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్‌ సమయంలో, వరదలు వచ్చిన సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనని మంత్రి రోజా అన్నారు. రాజకీయం, ప్యాకేజీల కోసం మీ మదర్‌ను, ఫ్యామిలీని జనసేన నాయకులను తిట్టిన వారిని వెనకేసుకురావడం అతడికే చెల్లిందని విమర్శించారు. వారాహి అనే అమ్మవారి పేరిట చేపట్టిన వాహనంపై చెప్పులు వేసుకుని, ఇష్టారీతిన ప్రత్యర్థులను తిట్టడం శోచనీయమని అన్నారు. జగనన్న సురక్షణ కార్యక్రమం ఎన్నో సేవలు అందించిందని రోజా పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివితే చాలదంటూ ఆమె అన్నారు. జగనన్నపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకున్నా చంద్రబాబును సీఎంగా చేయలేవని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ను తిట్టే అర్హత పవన్‌కు లేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి తెలుసుకోకుండా అజ్ఞానిలో పవన్‌ మాట్లాడుతున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి అబాసు పాలవుతున్నాడని ఆరోపించారు. మిస్సింగ్ కేసు అంటే బయట తప్పిపోతే దాన్ని మిస్సింగ్ కేసు అంటారు. అంతేకాని ఏదిపడితే అది మాట్లాడొద్దంటూ రోజా పవన్‌ని ఉద్ద్యేశించి మాట్లాడారు. అంతేకాదు దమ్ముంటే వచ్చే ఎలక్షన్‌లో గెలిచి చూపించాలని ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు