ఏపీ సీఎం జగన్‌కి జ్వరం వచ్చింది. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఫీవర్ కారణంగా ఆయన కాస్త వీక్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. జగన్‌ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్‌మెంట్లన్నీ రద్దు చేశారు. కేబినెట్ భేటీ టైమ్‌లో జగన్ అంత యాక్టివ్‌గా మాట్లాడలేకపోయారని సమాచారం. అయితే కాస్త ఓపిక తెచ్చుకోని అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలన్నదానిపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. వీక్‌గా ఉన్నా సీఎం మాత్రం తన పని పూర్తి చేశారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
వైరల్ ఫీవర్ సీజన్:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు చాలా మంది వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జగన్‌కి కూడా జలుబు, దగ్గు ఉంది. డాక్టర్లను సంప్రదించగా వైరల్ ఫీవర్‌గా తేల్చారు. రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జగన్ మెడికేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరిని కలవడకుండా అపాయింట్‌మెంట్లను రద్దు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చంద్రబాబు టార్గెట్‌గా ఆయన చేసిన స్కామ్‌ల గురించి జగన్ స్వయంగా ప్రజెంటేషన్ ఇస్తారని తెలుస్తోంది.
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్‌ని ప్రస్తావించాలని.. ఆయన జైలుకు ఎందుకు వెళ్లారన్న విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ అసెంబ్లీలో ప్రధానంగా హైలెట్ చేసే అవకాశం ఉంది. వారి సమస్యలకు ఈ అసెంబ్లీలోనే ఫుల్‌స్టాప్ పెట్టాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటివలి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.
ఇక విశాఖలోనే బ్రో:
అక్టోబర్‌లో విజయదశమి (దసరా) నుంచి విశాఖపట్నం నుంచి రాష్ట్రాన్ని పరిపాలించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రకటన చేశారు. విశాఖను రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మార్చే ప్రణాళికలకు ఇది అనుగుణంగా ఉంది. రోజువారీగా పరిపాలనకు అవసరమైన సీఎంఓ అధికారులు, ఇతర కీలక సిబ్బందిని ముఖ్యమంత్రితోపాటు పోర్టు సిటీకి తరలిస్తారు. ముఖ్యమంత్రి నివాసాలు, క్యాంపు కార్యాలయాలను గుర్తించి సిద్ధంగా ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సచివాలయాన్ని పూర్తిగా తరలించే ప్రక్రియ దాదాపు డిసెంబర్‌లో ఉండవచ్చని వర్గాలు తెలిపాయి.
ALSO READ: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే…