బ్రిడ్జ్‌ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక

తనతో సహజీవనం చేసిన మహిళతో పాటు ఆమె కుటుంబాన్ని నదిలోకి తోసేశాడు ఓ కిరాతకుడు. భర్తతో గొడవల కారణంగా విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న సుహాసిని(36)జీవితంలోకి రెండేళ్ల క్రితం ప్రవేశించిన సురేశ్‌(30) మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాడేపల్లిలో నివాసముంటున్న ఈ ఇద్దరికి ఏడాది క్రితం ఓ పాప (జెర్సీ) కూడా జన్మించింది. అయితే ఎలాగైనా ఈ కుటుంబాన్ని వదిలించుకోవాలనుకున్న సురేశ్‌ సుహాసిని కుటుంబాన్ని షాపింగ్‌ పేరుతో రాజమండ్రి తీసుకెళ్లాడు..రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున 4గంటల సమయంలో వారందరిని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లి రెయిలింగ్‌ నుంచి తోసేశాడు. ఈ ప్రమాదంలో సుహాసిని, జెర్సీ నదిలో గల్లంతవగా.. కుమార్తే కీర్తన రెయిలింగ్‌కి అనుకోని ఉన్న పైపును పట్టుకోని ప్రాణాలు కాపాడుకుంది.

New Update
బ్రిడ్జ్‌ పైపు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న సాహస బాలిక

గుండె నిండా ధైర్యం ఉప్పొంగింది. ఎలాగైనా బతకాలనే ఆశ ఆమెలోని సమయస్ఫూర్తిని బయటకు తీసేలా చేసింది. కళ్లముందే తల్లి, చెల్లి మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నా.. తండ్రి లాగా భావించిన వ్యక్తే యముడై తనను కాటికి పంపాలనుకున్నా.. ఆ బాలిక మాత్రం వణకలేదు. చుట్టూ అంధకరమే అలుముకున్నా.. కను చూపు మేరలో సాయం చేసే నాథుడే కనపడకున్నా ఆమె బెదరలేదు. బతకాడానికి కావాల్సింది డబ్బు కాదని.. ధైర్యముంటే మృత్యువుని కూడా జయించవచ్చని నిరూపించిందామె. చిన్నచిన్న సమస్యలకే ఊపిరి వదులుతున్న వారికి స్ఫూర్తి నింపేలా ఆ బాలిక చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తి యావత్‌ దేశ ప్రజలను సలామ్ కొట్టేలా చేసింది. ఇప్పుడా బాలిక టాక్‌ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌ కాదు.. టాక్‌ ఆఫ్‌ ది కంట్రీ..! అవును..! మన రాపులపాలెంలో జరిగిన ఓ ఘటనను హిందీ మీడియా కూడా హైలెట్ చేస్తుందంటే ఆ బాలిక ఏం చేసిందో మీరంతా తెలుసుకోవాల్సిందే!

తండ్రి అనుకుంటే..!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పుప్పాల సుహాసిని(36) భర్తతో గొడవల కారణంగా విడిపోయి దూరంగా ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తోంది. ఆమెకు కిర్తన అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం కీర్తన 13ఏళ్ల బాలిక. ఇక భర్తతో విభేదాలు పెరగడంతో విడాకులు తీసుకున్న సుహాసినికి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్‌(30)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారి తీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సుహాసిని(suhasini), సురేశ్‌(suresh) పిల్లలతో కలిసి ఉంటున్నారు. సురేశ్‌తో సహజీవనం కారణంగా వీరిద్దరికి జెర్సీ (1) జన్మించింది. ఇప్పటివరకు అంతాబాగానే ఉన్నా ఇంతలోనే సురేశ్‌ తన రియాల్టిని బయటకు తీశాడు. ఎలాగైనా సుహాసినిని వదలించుకోవాలనుకున్నాడు. తరుచుగా సుహాసినితో గొడవ పడడం మొదలుపెట్టాడు. అయినా ఆమె సురేశ్‌ని వదలలేదు.

publive-image బ్రిడ్జ్‌ పైపు పట్టుకోని ప్రాణాలు కాపాడుకున్న కీర్తన

ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని:
సుహాసినికి మంచి చెప్పినా.. గొడవ పడినా మాట వినడం లేదని గ్రహించిన సురేశ్‌.. ఆమెతో పాటు పిల్లలను కూడా అంతమొందించాలని ఫిక్స్ అయ్యాడు. సరదాగా బయటకు వెళ్దామని చెప్పి తాడేపల్లి నుంచి రాజమండ్రి తీసుకువెళ్లాడు. రాత్రంతా అక్కడే తిప్పాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి నమ్మించాడు. సుహాసిని, పిల్లలు కూడా అంగీకరించడంతో వారందరిని రెయిలింగ్‌ దగ్గర పిట్టగోడపై నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ముగ్గురిని నదిలోకి తోసేశాడు. ఆ తర్వాత కారు తీసుకుని పారిపోయాడు.

publive-image

సెల్యూట్ కీర్తన:
జీవితంలో అందరికంటే ఎక్కువగా సురేశ్‌ని నమ్మిన సుహాసిని గోదావరిలో పడిపోయింది. వాళ్లద్దరికి జన్మించిన జెర్సీ కూడా నదిలో కొట్టుకుపోయింది. అయితే 13ఏళ్ల కీర్తనkeerthana) మాత్రం.. గోదావరిలో పడలేదు. సురేశ్‌ అలా తోసి..వెంటనే వెళ్లిపోయాడు. రెయిలింగ్‌కి ఆనుకోని ఉన్న ఓ పైపును గట్టిగా పట్టుకోని ఉండిపోయింది కీర్తన. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు.. 'హెల్ప్‌.. హెల్ప్' అని చాలా సేపు అరిచింది. ఇంతలోనే తన జేబులో ఫోన్‌ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. అప్పటికీ పైపును గట్టిగా రెండు చేతులతో పట్టుకోని ఉన్న కీర్తన.. జేబులో నుంచి ఫోన్‌ తీసుకోవాల వద్ద అని కాసేపు ఆలోచించింది. ఇప్పుడు ఫోన్‌ తీయ్యకపోతే తన ప్రాణాలు కచ్చితంగా పోతాయని.. ఎక్కువ సేపు ఇలా పైపును పట్టుకోని ఉండలేనని ఫిక్స్‌ అయిన కీర్తన.. ఒక చేతితో పైపును పట్టుకుంటూనే మరో హ్యాండ్‌తో ఫోన్‌ తీసి.. '100'కి డయాల్ చేసింది. పోలీసులకు జరిగినదంతా చెప్పింది. వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు కీర్తనను కాపాడారు. మృత్యువు ఒడిలోకి చేరుతుందనుకున్న కీర్తన ఆఖరి నిమిషంలోనూ ధైర్యాన్ని చూపి బతికింది. కీర్తన ధైర్యం, సమయస్ఫూర్తిని చూసి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. మరోవైపు నిందితుడు సురేశ్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు