చంద్రబాబు మాయలో పవన్.. YCP సంచలన ట్వీట్! AP: చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో పవన్ చిక్కుకున్నారని వైసీపీ ట్వీట్ చేసింది. సరస్వతి సంస్థ భూముల పరిశీలకు వెళ్తానన్న పవన్‌కు.. మీరు వెళ్ళాల్సింది రాష్ట్రవ్యాప్తంగా అఘాయిత్యాలకు గురవుతున్న మహిళలు, అమ్మాయిల ఇళ్లకు అని కౌంటర్ ఇచ్చింది. By V.J Reddy 05 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి YCP: పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. తాను త్వరలో పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతీ శక్తి భూ ఉల్లంఘనలను తనిఖీ చేయాలనుకున్నాను అని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చింది. మీరు వెళ్ళాలసింది.. రాష్ట్రవ్యాప్తంగా అఘాయిత్యాలకు గురవుతున్న మహిళలు, అమ్మాయిల ఇళ్లకు. పిఠాపురంలో టీడీపీ నాయకుడి చేతిలో అత్యాచారానికిగురైన బాలికసహా మరెంతోమంది బాధితుల ఇళ్లకి అని కౌంటర్ ఇచ్చింది. కాగా సరస్వతి పవర్ భూములు పట్టా భూములని మీ ఆదేశాలమేరకే పరిశీలన చేసిన మీ ప్రభుత్వంలోని ఎమ్మార్వో అక్టోబరు 26న తేల్చి చెప్పారని తేల్చి చెప్పింది. .@PawanKalyan .. మీరు వెళ్లాల్సింది ప్రయివేటు భూముల్లోకి కాదు. అవి పట్టా భూములని మీ ఆదేశాలమేరకే పరిశీలన చేసిన మీ ప్రభుత్వంలోని ఎమ్మార్వో అక్టోబరు 26న తేల్చిచెప్పారు. పవన్‌కళ్యాణ్.. మీరు వెళ్లాల్సింది రాష్ట్రవ్యాప్తంగా అఘాయిత్యాలకు గురవుతున్న మహిళలు, అమ్మాయిల ఇళ్లకు. పిఠాపురంలో… https://t.co/x37q4b8zHX — YSR Congress Party (@YSRCParty) November 5, 2024 చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో... వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో... ". పవన్ కళ్యాణ్ .. మీరు వెళ్లాల్సింది ప్రయివేటు భూముల్లోకి కాదు. అవి పట్టా భూములని మీ ఆదేశాలమేరకే పరిశీలన చేసిన మీ ప్రభుత్వంలోని ఎమ్మార్వో అక్టోబరు 26న తేల్చిచెప్పారు. పవన్‌కళ్యాణ్.. మీరు వెళ్లాల్సింది రాష్ట్రవ్యాప్తంగా అఘాయిత్యాలకు గురవుతున్న మహిళలు, అమ్మాయిల ఇళ్లకు. పిఠాపురంలో టీడీపీ నాయకుడి చేతిలో అత్యాచారానికిగురైన బాలికసహా మరెంతోమంది బాధితుల ఇళ్లకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యాచారాలకు గురైన 79 మంది మహిళలు, బాలికలు ఇళ్లకు. వారి ఆక్రందనలు, ఆ కుటుంబాలకు జరిగిన అన్యాయాలు మీకు కళ్లకు కనిపించడంలేదు, మీ చెవులకు వినపడ్డంలేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సిందిపోయి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగస్వామి అవుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారు." అని విమర్శలు గుప్పించింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి