YS Sharmila: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుపై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఒక బీసీ అని అన్నారు. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే.. కానీ బీసీ అయిన మోదీ మాత్రమే గర్వంగా ఉన్నారని చురకలు అంటించారు. బీసీలు మాత్రం గర్వంగా లేరని అన్నారు. "బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ" అని అన్నారు.
మాట మార్చారు...
2017లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు. మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారని ఫైర్ అయ్యారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం అన్నారు. బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదని విమర్శించారు. బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళని అన్నారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని.. అదానీ,అంబానీలకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ.. బీసీలు అంటే మోదీ ఓట్లు వేసే యంత్రాలు అని విమర్శలు గుప్పించారు.
షర్మిల ట్విట్టర్ లో.. "రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143కి పెంచారు. బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానంలో నిలబెట్టారు. స్కాలర్ షిప్లు ఇచ్చారు. అందుకే బీసీలు వైఎస్ఆర్ గారిని తమ నాయకుడుగా ఓన్ చేసుకున్నారు. ఆ రోజుల్లో బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీల హక్కుల కోసం ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. కానీ వైఎస్ఆర్ గారు దీక్ష చేస్తే బీసీలను అగౌరవపరిచినట్లు అనుకున్నారు. కృష్ణయ్య పెట్టిన 17 డిమాండ్ లు ఒప్పుకున్నారు. అసెంబ్లీలో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే.. చంద్రబాబు బీసీల ద్రోహి. 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నారు. టీడీపీ బీసీల పార్టీ అన్నారు. 40 ఏళ్ల నుంచి టీడీపీనీ మోస్తుంది బీసీలు అని చెప్పారు. బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అని మోసం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. పరిశ్రమలకు ప్రోత్సాహం అని కూడా మోసం చేశారు. బీసీల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదు..ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు." అని పోస్ట్ చేశారు.