YS Jagan : వినాయక ఉత్సవాల్లో జగన్‌ పాటలు..కేసు నమోదు!

అన్నమయ్య జిల్లాలో గణేశ్‌ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. దీంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

author-image
By Bhavana
YS Jagan Songs
New Update

YS Jagan : గణేశ్‌ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని కీర్తిస్తూ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో శుక్రవారం జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బి.కొత్తకోట మండల కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక పోకనాటివీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని సెప్టెంబరు 13న నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చేపట్టిన ఊరేగింపు స్థానిక జ్యోతి బస్టాండుకు వద్దకు వచ్చింది. 

Also Read :  బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్‌ ఇచ్చిన కలెక్టర్!

సాంస్కృతిక కార్యక్రమాల స్థానంలో డీజే సౌండ్‌ బాక్సుల నుంచి ‘కావాలి జగన్‌… రావాలి జగన్‌’ అంటూ పాటలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొద్దిసేపటికి వైసీపీ జెండాలను ఊరేగింపు వాహనాలపై కొందరు పెట్టారు. దీంతో భక్తులు ఒకసారిగా విస్తుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు.. అప్పటికప్పుడే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ పార్టీ జెండాలను ప్రదర్శించడంతో పాటు మాజీ సీఎంను కీర్తిస్తూ పెట్టిన పాటలను వెంటనే నిలిపివేయాలని పోలీసులను కోరారు.

Also Read :  చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ?

అయితే, వారు స్పందించకపోవడంతో చివరకు దీనిపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుకు టీడీపీ (TDP) నాయకులు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ కొండల నాయుడు, ఇంఛార్జి సీఐ రాజా రమేష్‌లు శనివారం బి.కొత్తకోటకు చేరుకుని ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఊరేగింపు సందర్భంగా పార్టీల ప్రస్తావన తీసుకు రావడానికి గల కారణాల గురించి అడిగారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినవారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read :  విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌..దుబాయ్‌!
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe