BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్

AP: హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని  పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Punganur: వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీలపై కేసు నమోదు
New Update

YCP MP Mithun Reddy: హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని  పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

జులై నెలలో జరిగిన అల్లర్లు..

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

జూలై నెలలో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటన నేపథ్యంలో మిథున్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరులోని మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడికి యత్నించారు. రాళ్ల దాడిలో 15 కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో వైసీపీ, టీడీపీ ఇరువర్గాలు రాళ్లు, కుర్చీలతో దాడి చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

రెడ్డప్ప ఇంటికి చుట్టుముట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎంత అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మరోవైపు ఆత్మరక్షణలో భాగంగా గన్‌మెన్‌ సైతం కాల్పులు చేశారు. 3 రౌండ్‌లు గాల్లోకి కాల్పులు జరిపారు మిథున్ రెడ్డి గన్‌మెన్. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై రెడ్డప్ప స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe