Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు!
ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.