Borra Caves: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!
పర్యాటక ప్రదేశం అయిన బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. వేతనాల పెంపు విషయం గురించి అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.
పర్యాటక ప్రదేశం అయిన బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. వేతనాల పెంపు విషయం గురించి అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.
అనకాపల్లి జిల్లాలో మంత్రి గుడివాడ అమర్నాధ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చోడవరం జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఒక బోగస్ యాత్ర కు శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లాలో జవాన్ అలీముల్లాపై దాడి చేసిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించేదేలేదని డిఐజి పి. హరికృష్ణ తేల్చి చెప్పారు. పోలీసులు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేని పక్షంలో ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. వై ఏపీ నీడ్స్ జగన్.. దేనికోసం..? అంటూ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని మీ మూర్ఖుపు పాలనతో అధోగతిపాలు చేసి.. అగమ్యగోచరంలోకి నెట్టేసినందుకా.. ఈ రాష్ట్రానికి మీరు అవసరం అంటూ దుయ్యబట్టారు.
అనకాపల్లిలో జవాన్ పై దాడి ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై లోకేష్ సీరియస్ గా స్పందించారు. దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోందన్నారు. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు.
అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది.
నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విడదల రజని. ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తుంటే.. లోకేష్ మాత్రం హేళన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని.. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని అన్నారు.
విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తునట్లు అధికారులు వివరించారు.
రుషికొండ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది.