NTR District: కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం.!
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అవి శాంతి పూజలా లేక క్షుద్రపూజలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. అవి శాంతి పూజలా లేక క్షుద్రపూజలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలోని లేని బీసీల అభివృద్ధి ఏపీలో ఉందని బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. జగన్ బీసీల అభివృద్ధి చేస్తుంటే చూడలేని అగ్రవర్ణాల పెద్దలు చూడలేకపోతున్నారంటూ విమర్శించారు.
ఏపీలో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. ఇప్పుడు బీజేపీ సైతం పొత్తుకు సై అంటోంది. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి అన్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు.
వ్యూహం సినిమాని ఆపాలని సెన్సార్ బోర్డు వారికి నేను చెప్పలేదని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా గణనీయంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో.. చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. మంచు దుప్పటి కమ్మేస్తోంది. రహదారులు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చలి తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
ఏపీ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో ఓ కీలక నిర్ణయం గురించి ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు టీచర్ పోస్టుల గురించి ఓ నివేదిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు
టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్‌కు సీఐడీ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నట్లు తెఉలస్తోంది. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ.. కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసింది. మరి లోకేష్ స్పందన ఎలా ఉంటుందో? అని ఉత్కంఠ నెలకొంది.