Deputy CM:మా తప్పును కాయి తండ్రీ..11 రోజల పాటూ పవన్ ప్రాయిశ్చిత దీక్ష తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన తప్పుకు ప్రాయశ్చితంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. By Manogna alamuru 21 Sep 2024 | నవీకరించబడింది పై 21 Sep 2024 22:23 IST in విజయవాడ తిరుపతి New Update షేర్ చేయండి Deputy CM Pawna Kalyan: తిరుమల లడ్డూ ఎంతో పవిత్రమైనది. పరమ పవిత్రంగా భావించే ఈ అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదం వికృత పాలకుల చేతిలో పడి అపవిత్రం అయింది. జంతు అవశేషాలతో మలినం అయింది. ఈ విన్న తరువాత నా మనసు ఎంతో కలత చెందింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అపరాధ భావానికి గురైంది. అందుకే ప్రాయశ్చిత దీక్ష చేయాలని అనుకుంటున్నా. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటూ దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతీ ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగించిన తర్వాత ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని తాను తిరుమలలో బాలాజీని వేడుకుంటానని పవన్ చెప్పారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి అకృత్యాలకు ఒడిగడతారని ఆయన విమర్శించారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత ప్రభుత్వం పాలనను ఆయన దుయ్యబట్టారు. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ అన్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసిందని తెలిపారు. Also Read: Hyderabad: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి