లిక్కర్ మాఫియా గుట్టురట్టు..గోవా టూ వైజాగ్, విజయనగరం ..!
గత కొంతకాలంగా గోవా టూ శ్రీకాకుళం వయా విశాఖపట్నం యదేచ్ఛగా లిక్కర్ రవాణా సాగుతోందని పోలీసుల సమాచారం. దీనికోసం ఓ ముగ్గురు ముఠాకట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన పొద్దిలాపూర్ సత్యనారాయణ, ధనుంజయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్ల లక్ష్మణ్ భాగస్వాములుగా ఉన్నారు. విజయనగరం సత్యనారాయణ ఈ దందాలో ప్రధాన నిందితుడు. అతడు గోవాలో చీప్ లిక్కర్ రూ.26 కొని రూ. 92 కు శ్రీకాకుళం లక్ష్మణ్ కి అమ్ముతాడు. అతను రూ. 100 కి ధనుంజయకు అమ్ముతాడు.ధనుంజయ రూ. 120కు లోకల్ మందుబాబులకు అమ్ముతాడు. గోవా నుంచి బాక్సులకు బాాక్సులు లిక్కర్ వాస్కోడీగామా ట్రైన్ లో వైజాగ్ కు తరలిస్తారు.ఈ సరుకుని వివిధ బస్ రూట్లలో పలు ప్రాంతాలకు తరలిస్తారు.డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరచూ వస్తున్న ప్రయాణికుల పై నిఘా పెంచారు.