ఏపీలో హైటెన్షన్.. రామాలయం రథానికి నిప్పు

AP: అనంతపురం కనేకల్ మండలం హనకనహాల్‌లో కొందరు దుండగులు రామాలయ రథానికి నిప్పు అంటించారు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పారు. రాష్ట్రంలో లడ్డూ వివాదం నడుస్తున్న వేళ ఈ ఘటన జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టితోంది.

Anantapur
New Update

Anantapur: అనంతపురం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రామాలయ రథానికి కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దట్టమైన పొగ అలుముకోవడంతో గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. మంటల్లో సగానికిపైగా రథం కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కీలక అంశాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. కనేకల్ మండలం హనకనహాల్‌లో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే లడ్డూ వివాదంతో రాజకీయ ప్రకంపనలు నెలకొన్న వేళ ఈ సంఘటన జరగడం మరో వివాదానికి దారి తీసింది.

రణరంగంగా లడ్డూ వివాదం...

ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ వివాదంపై ప్రభుత్వం, వైసీపీ నడుమ యుద్ధ వాతావరణం తార స్థాయికి చేరుకుంది. ఇది కూటమి హయాంలో తిరుపతి లడ్డూ అపవిత్రం అయిందని వైసీపీ.. లేదు జగన్ హయాంలోనే లడ్డూ కల్తీ అయిందని కూటమి నేతలు ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ విమర్శలు దాడి చేశారు. ఈ వివాదంపై సీబీఐ విచారణ జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

చంద్రబాబు ఆగ్రహం...

తిరుమల లడ్డూ వివాదం జగన్ పై విమర్శల దాడికి దిగారు సీఎం చంద్రబాబు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చని అన్నారు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం అని... నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు అని మండిపడ్డారు.

ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? వైసీపీ వాళ్ళు అన్నారని గుర్తు చేశారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?... రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారని అన్నారు. రధం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారని ఫైర్ అయ్యారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి