/rtv/media/media_files/vbjs7L6TDCdn8wsvr6Lh.jpg)
తిరుపతి శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వార్తలపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి విచారణ చేసి వాస్తవాలు తేల్చాలని భక్తులు కోరుతున్నారు. నిజంగా కల్తీ జరిగినట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు టీటీటీ ఆలయశుద్ధి సైతం చేసింది.
It is not true that there was tobacco found in the laddu prasadam - TTD.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 24, 2024
It is inappropriate for some devotees to spread on social media that there was a packet of tobacco found in the sacred Srivari laddu prasadam.
లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లo ఉన్నది వాస్తవం కాదు - టీటీడీ pic.twitter.com/wjJoRaUqAE
అదంతా ఫేక్..
ఇదిలా ఉంటే.. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందన్న వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది భక్తులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో శ్రీవారి లడ్డూల నాణ్యతపై మరోసారి భక్తుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీటీ స్పందించింది. ఇదంతా దుష్ప్రచారం అని కొట్టిపారేసింది. లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో తయారు చేస్తారని తెలిపింది. ఈ లడ్డూ తయారీ ప్రక్రియను 360 డిగ్రీల సీసీ టీవీ నిఘాతో క్షుణ్ణంగా పర్యవేక్షిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది టీటీడీ.