BIG BREAKING: తిరుమలకు వచ్చింది కల్తీ నెయ్యే.. రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు!

తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (UP), వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ వివరాలను టీటీడీ చైర్మన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

New Update
Tirupati Laddu

తిరుపతి కల్తీ నెయ్యి ఘటనలో సిట్ అధికారులు ఈ రోజు నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వారి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన X ఖాతా ద్వారా వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (ఉత్తరప్రదేశ్), వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలిందన్నారు. 

2019లోనే బోలేబాబా డెయిరీ నెయ్యి..

బీఆర్ నాయుడు ట్వీట్ ప్రకారం.. 2019లోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను  తిరస్కరించిన టీటీడీ, ఆ తరువాత వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్లు విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (ఉత్తరప్రదేశ్), వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఏఆర్ డెయిరీ అసలైన ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఎక్కువగా చూపించి టెండర్ దక్కించుకున్నట్లు సిట్ గుర్తించింది. వార్షిక పాలు, నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలతో చూపించి టెండర్ సాధించినట్లు తేల్చింది. ఆ డెయిరీ అసలు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం 945.6 మెట్రిక్ టన్నులు కాగా.. 3,072 మెట్రిక్ టన్నులుగా చూపించినట్లు తేలింది.

టెండర్ సాధించేందుకు భోలేబాబా డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ కి రూ.70 లక్షలు బదిలీ జరిగినట్లు గుర్తించారు. టెండర్ కోసం అవసరమైన రూ.51 లక్షల డిపాజిట్ మొత్తాన్ని కూడా భోలేబాబా సంస్థే చెల్లించిందని నిర్ధారించింది. 2024లో ఏఆర్ డెయిరీ కి టెండర్ ₹319.80 కి.గ్రా. ధరకు కేటాయించబడింది. అయితే ఇదంతా అసలు నెయ్యి ధరకు తక్కువగా ఉండటంతో కల్తీ నెయ్యి సరఫరాకు దిగినట్లు తెలుస్తోంది. టెండర్ దాఖలు సమయంలో 2024 మార్చి 12న చెన్నై నుంచి పీపీ శ్రీనివాసన్ తప్పుడు డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేశారు.

దీనిని డైరెక్టర్ డైరెక్టర్ పొమిల్ జైన్ సూచనల మేరకు చేసినట్లు సిట్ గుర్తించిందని సమాచారం. నిందితులు అరెస్ట్ తప్పించుకునేందుకు మొబైళ్లను ఆఫ్ చేసి, కొత్త ఫోన్లు కొనుగోలు చేసి, డిజిటల్ ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించినట్లు సమాచారం. ఏఆర్ డెయిరీకి ప్రతీ కిలో నెయ్యికి రూ.2.75 నుండి రూ.3 వరకు కమిషన్ ఇస్తామంటూ వైష్ణవి, భోలేబాబా డెయిరీలు రహస్య ఒప్పందం చేసుకున్నట్లు సిట్ తన రిపోర్ట్ లో పొందుపరిచింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు