Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా అనే అంశంపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. లడ్డూ ఎక్కడ నుంచి వచ్చింది?, ఎక్కడ తాయారు అయింది?, లడ్డూ ఏ నెయ్యి వాడారు?, ఆవు నెయ్య? లేదా బర్రె నెయ్య?, కల్తీ జరిగి ఉంటే ఎక్కడ జరిగింది?, ఎవరి అండతో కల్తీ చేశారు?, అధికారులకు తెలిసిన సైలెంట్ గా ఉన్నారా? ఇలా అనేక కోణాల్లో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసు విచారణలో సిట్ అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు.
అది ఏఆర్ డెయిరీ నెయ్యి కాదు...
నిన్న సుప్రీం కోర్టు నియమించిన సిట్ అధికారులు సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి కేసు విచారణలో తాము సేకరించిన సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్ కు వివరించారు. అసలు ఈ నెయ్యి ఏఆర్ డెయిరీ తాయారు చేసింది కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు. వాస్తవానికి లడ్డూ తాయారు చేసేందుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేస్తామని టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ ఒప్పందాలను పక్కకు ఏఆర్ డెయిరీ నిర్వాహకులు వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ అధికారుల విచారణలో తేలింది.
ఖచ్చితమైన ఆధారాలతో...
కాగా ఈ ఏడాది మొదట్లో టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం చేసుకుంది. ఏఆర్ డెయిరీ సంస్థ తమిళనాడుకు చెందినది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా ఏఆర్ డెయిరీ వ్యవహరించింది. తమ లారీలను వైష్ణవి డెయిరీకి పంపి అక్కడి నుంచి నెయ్యిని తీసుకొని.. టీటీడీకి సరఫరా చేసినట్లు ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. లారీ వెళ్లే మార్గాలు, టోల్ గెట్ వద్ద ఆగిన సమయాలు ఇలా అన్ని ఆధారాలను సిట్ అధికారులు పక్కాగా సేకరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసు విచారణ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కేసును సిట్ అధికారులు ఛేదించి అసలు విషయాలను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.