నన్ను చంపాలనుకున్నారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! AP: జైల్లో ఉన్నప్పుడు తనను చంపాలని కుట్ర చేశారనే ప్రచారం జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన దానికి కక్ష తీర్చుకోవడం తన లక్ష్యం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకే తాను కృషి చేస్తానని చెప్పారు. By V.J Reddy 10 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అందరి కంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానే అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ మోపిన అక్రమ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్నప్పుడు తనను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయనే వార్తలు కూడా వచ్చాయని చెప్పారు. జైల్లో డ్రోన్లు కూడా ఎగురవేశారని అన్నారు. జైలు లోపల చుట్టూ కెమెరాలు పెట్టారని తెలిపారు. దోమ తెర కూడా ఇవ్వలేదని అన్నారు. కక్ష తీర్చుకోవడం... గత ప్రభుత్వం చేసిన దానికి కక్ష తీర్చుకోవడం తన లక్ష్యం కాదని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనను చిత్తూ చేసి.. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరీ మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసు అని వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంగా మారాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి