BIG BREAKING: టీడీపీ నుంచి కొలికపూడి ఔట్?

జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

New Update
Chandrababu Naidu Kolikapudi Srinivas

Chandrababu Naidu Kolikapudi Srinivas

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దాడి చేశారు. దీంతో ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కొలికపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు