Sajjala Ramakrishna Reddy: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ముందస్తు బెయిలు కోసం సజ్జల దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో నాలుగు వారాలు పొడిగించింది. ఆయనపై కఠిన చర్యలు వద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు తెలిపింది.
ఇది కూడా చదవండి: ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ!
నన్ను టార్గెట్ చేస్తున్నారు..!
సజ్జల తరఫున వాదనలు చేసిన న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జలను టార్గెట్ చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో ఈ కేసులో తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టి తనపై చర్యలు తీసుకునేలా గుంటూరు ఎస్పీ లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీచేశారని, బాధ్యులను కోర్టుధిక్కరణ కింద శిక్షించాలని కోరుతూ సజ్జల మరో పిటిషన్ ను దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది. ఈ క్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్, మంగళగిరి గ్రామీణ ఠాణా సీఐ శ్రీనివాసరావుకు నోటీసులు అందించింది. కాగా దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది ధర్మాసనం.
ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్
2021లో దాడి..
గత వైసీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశా. కాగా దీనిపై తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంను ఫలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు కొందరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దాడి కుట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు.