MP Sana Satish Birthday : మంత్రి లోకేష్ సమక్షంలో ఎంపీ సానా సతీష్ బర్త్ డే వేడుకలు

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

New Update
sana satheesh

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి లోకేష్ బర్త్ డే విషెస్ తెలిపి  కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ కు దేవుడు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షును ప్రసాదించి, ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. సానా సతీష్  బర్త్ డే వేడుకులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సానా సతీష్  1972 ఆగస్టు 19న జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా, తమ్మవరం గ్రామానికి చెందినవారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు