Ap Tdp: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు కీలక టీడీపీ నేతలతో పాటు దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు తమను టార్గెట్ చేశారని వాపోయేవారు.
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!
కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు, నేతలు సొంత పార్టీ ప్రభుత్వం వచ్చినా తమ పరిస్ధితి మారలేదని వాపోతున్నారు.
Also Read: ఇజ్రాయెల్ ప్యాంట్ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!
వైసీపీ హయాంలోనే..
ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలోనే ధైర్యంగా ఉన్నామని సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: భారత్ దెబ్బ..మాల్దీవులు అబ్బా..డబ్బుల్లేక అధ్యక్షుడీ జీతంలో కోత
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందని ఆయన వాపోయారు.
Also Read: జగన్ బెయిల్ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్!
తాజాగా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన పార్టీ నేతల భేటీలో అరవిందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు.
Also Read: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..!
ఇప్పటికీ ఇసుక, మద్యం వైసీపీ మాఫియా చేతుల్లోనే ఉందని, ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారని, కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అరవిందబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: మాజీ హోంమంత్రి సోదరుడు అని చెప్పుకుంటూ.. ఏం చేశాడంటే?
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదని తాజా ఘటనతో నిరూపితమైంది.
Also Read: ఇరాన్ సైనిక బలగాలపై ఇజ్రాయెల్ దాడులు!