జగన్ మేనమామకు టీడీపీ భారీ షాక్

AP: జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీలో పురపాలక ఛైర్మన్‌‌తో సహా ఐదుగురు కౌన్సిలర్లు చేరారు.

JAGAN
New Update

YSRCP: ఏపీ రాజకీయాల్లో రాజీనామాలు చేరికల పర్వం కోనసాగుతోంది. తాజాగా వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. జగన్ మేనమామ,  కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ దెబ్బ కొట్టింది.  కమలాపురం పురపాలక సంఘాన్ని హస్తగతం చేసుకుంది టీడీపీ. దీనిపై అధికారిక ప్రకటనను టీడీపీ విడుదల చేయాల్సి ఉంది. తాజాగా పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు.. షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి సమక్షంలో ఫ్యాన్ గుర్తు వదిలి సైకిల్ గుర్తు ఉన్న పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల్లో ఓటమి వైసీపీ చెందడంతో గతంలో కొందరు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇదిలా ఉంటే తాజా  కౌన్సిలర్లతో టీడీపీ సంఖ్యా బలం 10కి చేరింది. అలాగే వైసీపీ సంఖ్యాబలం 8కి పడిపోయింది.

ఫ్యాన్ రెక్కలు.. ముక్కలు..

కాగా చేరికలతో  పురపాలక పీఠం దాదాపు టీడీపీ చెక్కిక్కించుకోనుంది. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు టీడీపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన 8 మంది కౌన్సిలర్లను కూడా టీడీపీలో చేర్చుకుని వైసీపీను కమలాపురం నుంచి ఖాళీ చేయించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే తమతో మరికొంత మంది కౌన్సిలర్లు ఉన్నారని.. త్వరలోనే వారు సైకిల్ ఎక్కబోతున్నారని అక్కడి స్థానిక టీడీపీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీలో చేరుతున్న వైసీపీ కౌన్సిలర్లు మాత్రం.. తాము సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి.. తమ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీలో చేరుతున్నట్లు చెబుతున్నారు.

మేనమామ అనేనా?

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న నేతలే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఓటమితో ఈ రాజీనామాల పర్వం మరింత వేగం పెంచుకుంది. ఒక డిజిట్ నుంచి రెండు డిజిట్ ల వరకు పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే జగన్ కు షాక్ ఇచ్చేందుకే ఆయన మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసిందనే చర్చ కూడా స్థానికంగా నడుస్తోంది. రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జగన్ ఆయనను నియమించారు. సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్‌రెడ్డి ఓటమి చెందారు. గతంలో పురపాలక ఎన్నికల్లో వైసీపీ నుంచి 15 మంది, టీడీపీ నుంచి 5మంది  కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఛైర్మన్‌ పీఠం ఆనాడు వైసీపీకి దక్కింది.తాజాగా అది టీడీపీ వశం కానుంది.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe