ఏపీలో స్విగ్గీ సేవలు బంద్.. ఎందుకంటే!

ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీకి అమ్మకాలు చేయబోమని తెలిపాయి. బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

SWIGGY
New Update

Swiggy: ఏపీలో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న స్విగ్గీకి షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ సేవలను బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. తమకు నగదు చెల్లించకుండా స్విగ్గీ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని హోటల్‌, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీకి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. 

జొమాటో ఒకే అంది..

ఫుడ్ డెలివరీ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ సంస్థలు తమకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు ఏపీలోని హోటల్ యజమానులు. తాము ఇచ్చిన ఫుడ్ కు డబ్బులను వారంలో లేదా మరోసటీ రోజే ఈ సంస్థలు ఇస్తాయని చెప్పారు. కాగా గత కొన్ని రోజుల నుంచి తమకు ఈ సంస్థలు చేసిన అమ్మకలకు సకాలంలో బిల్లులు చెల్లించక ఇబ్బందులు గురి చేస్తున్నాయని అన్నారు. అయితే ఈ రెండు సంస్థలతో పలు మార్లు చర్చలు జరపగా.. జొమాటో మాత్రమే తమ  అభ్యంతరాలను అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది. స్విగ్గీ మాత్రం తమ డిమాండ్లను పక్కకు పెట్టిందని.. అందుకే ఏపీ వ్యాప్తంగా స్విగ్గీ సేవలను నిలిపివేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe