Annamayya District: ఏపీలో ఆంజనేయ స్వామి వారి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక ఆలయ పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి గుడి కింద పేలుడు పదార్థాలు పెట్టి గుడిని పేల్చేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేశారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా పేలలేదు. దీంతో ఆలయం ఒకవైపు ఒరిగిపోయింది. ఈ ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లగా ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ముమ్మర దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Also Read: యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం
సికింద్రాబాద్‌లో మొండా మార్కెట్ సమీపంలోని ముత్యాలమ్మ గుడిపై దాడి ,ధ్వంసం ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే.. అన్నమయ్య జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయంపై దాడి జరగడంపై హిందూ ధార్మిక సంఘాల నేతలు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని కూల్చివేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Also Read: బండి మీద అలా రాస్తే రూ.700 ఫైన్.. హైదరాబాద్ పోలీసులపై విమర్శలు
గుడి పూజారే...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గట్టిగా గాలించిన అన్నమయ్య జిల్లా పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య కొద్ది రోజుల క్రితం వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేయించాడని తెలిపారు. ఇందుకోసం కొంత మందితో కలిసి ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: 500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటన
ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు, ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.