Grandhi Srinivas: జగన్‌కు షాక్.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ను శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే.

author-image
By V.J Reddy
New Update
Grandhi Srinivas

YCP Ex MLA Grandhi Srinivas: మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నేతల రాజీనామాలతో ఇక్కట్లు పడుతున్న జగన్ కు మరో నేత వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

అధిష్టానానికి దూరంగా...

ఎన్నికలు అయ్యాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అన్ని సెట్ అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని ఆయన అనుచరుల్లో మాట వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. 2019 లో సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే వైసీపీ అధిష్టానంపై శ్రీనివాస్ అలిగారు. పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న అధిష్టాన నేతలు శ్రీనివాస్ ను బుజ్జగించే పనులు పడ్డారు.

మరో ఇద్దరు కీలక నేతలు..

జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీ కి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పుపై సమాచారం ఇచ్చారు. ఆర్టీవీ తో అయన ఎక్సక్లూజివ్ గా మాట్లాడుతూ.. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేన లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రేపు జగ్గయ్యపేట లో నియోజకవర్గ కార్యకర్తల తో సమావేశం కానున్నట్లు తెలిపారు. తన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేన కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు