AP News: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులను అలెర్ట్ చేసింది. అయితే తిరుపతిలో భారీ వర్షాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేస్తున్నట్లు తెలిపారు. ఘాట్‌రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు టీటీటీ అధికారులు తెలుపుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలోని డ్యాం గేట్లు పర్యవేక్షించాలని ఈవో ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి:
ఇది కూడా చదవండి: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం
భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో బుధవారం ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు. అందులో భాగంగా అక్టోబర్ 17 (గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేసి.. టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆ తర్వాత శ్రీవారి మెట్టు నడక మార్గంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. శ్రీవారి మెట్టు నడక మార్గంపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: భూమిపై అంతరిక్షానికి దగ్గరగా ఉండే వింత ప్రదేశం