Pawan Kalyan: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విషయంపై ఒక మీడియా జర్నలిస్ట్ ప్రకాష్‌రాజ్‌ను ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు కోపం అన్నారు. ఈ ప్రశ్నపై మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ మరొకసారి పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూర్ఖత్వపు, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:
ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆయనని ఎన్నుకున్నది ఇందుకోసం కాదు కదా అని ప్రశ్నించారు. పవన్ చర్యలు తనకు నచ్చడం లేదని తెలిపారు. అడిగే వారు ఎవరో ఒకరు ఉండాలి కదా.. అందుకే ఆ పని నేను చేస్తున్నా అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రకాష్‌రాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఫామ్ హౌస్ కేసుపై మంత్రి జూపల్లి ఫైర్.. చట్టం ఎవరికి చుట్టం కాదంటూ!
గతంలోనూ పవన్‌పై ఫైర్
పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ లాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ సినీ లైఫ్‌ని రాజకీయాల్లో వాడుకుంటున్నారు కానీ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే స్థాయిలో చాలా నిజాయితీగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న విషయాలపై ఆయన ఫైర్ అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడుగానే కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తిగా నడుచుకుంటే మరింత బాగుంటుందనే విధంగా ఆయన అభిప్రాయంగా తెలిపారు.
Also Read: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!
ప్రజల కోసమే పార్టీ పెట్టి వారి కోసమే రాజకీయాలలోకి వచ్చానని తెలిపిన పవన్ కళ్యాణ్ వారి సమస్యల పరిష్కారం కోసం ఏకాగ్రతతో పని చేయాలిసిన అవసరం ఉన్నదని కూడా తెలిపారు. కానీ ఆయన చేస్తోంది విధ్వంసక రాజకీయ పాలన అంటూ ఇవి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తెలుపుతూ ఉన్నారు.
Also Read: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...!
లడ్డూ కల్తీ వివాదం నుంచి మొదలు..
తిరుమల లడ్డూ కల్తీ వివాదం చేలరేగినప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర సమస్య అని, మీరు అధికారంలో ఉన్నారని, నిజాలు బయటకు తీసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే!
''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం... ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?'' అంటూ ప్రకాష్ మరో ట్వీట్ చేశారు. తమిళనాడులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించారు. ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు.
మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతానంటూ ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.