BIG BREAKING: అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి.

New Update
Pawan Kalyan Son Injured In Fire Accident

Pawan Kalyan Son Injured In Fire Accident

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్‌ మన్యం పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అయితే.. ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కాళ్లు చేతులకు గాయాలు కావడంతో పాటు .. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ పాఠశాల యాజమాన్యం, కుమారుడితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పర్యటన తర్వాతే సింగపూర్ కు పవన్..

పర్యటన ఆపి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు పవన్ కు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని అధికారులకు పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని స్పష్టం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు