/rtv/media/media_files/2024/12/16/M0GRMqh1PjquanWAsNEX.jpg)
నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరడం ఖాయమైంది. అయితే నాగబాబుకు ఏ శాఖలు కేటాయిస్తారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. నాగబాబు కేబినెట్‌లోకి వస్తే జనసేన దగ్గరున్న శాఖల్లో కొన్నింటిని కేటాయించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ దగ్గర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి.
జనసేనకు చెందిన మరో ఎమ్మెల్యే కందుల దుర్గేష్ దగ్గర పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. ఇందులో సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో పాటు పవన్ వద్ద ఉన్న శాఖల్లో ఒక శాఖను కూడా నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.