Nellore: మేయర్ కు పెద్ద మొత్తం అందయా..!! అందుకే వైసీపీలోకి వెళ్లానున్నారా?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న మేయర్ స్రవంతి, జయవర్ధన్ తిరిగి వైసిపి గూటికి ఎందుకు వెళ్ళారు? అంత విశ్వాసంగా ఉన్న మేయర్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డికి దూరమవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసిపికి చెందిన రూఫ్ కుమార్ మేయర్ దంపతులను.. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపారు. వైసీపీలోనే కొనసాగుతామని.. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపుకి కృషి చేస్తామని చెప్పినట్లు సమాచారం. మేయర్ స్రవంతికి పెద్ద మొత్తంలో నజరానా కూడా అందినాయనే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి.