మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషతో పాటు ఆయన కూడా వేదికపై ఉన్నారు. దీంతో జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం నారా లోకేష్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కార్యక్రమం వివరాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
నూజివీడు పట్టణ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ సర్ధార్ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహాన్ని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది@gouthusireesha#KolusuParthasarathy#Nuzvid#ChandraBabuNaidu#PawanKalyan#TDP#NaraLokesh#AndhraPradesh… pic.twitter.com/7eM5t1vLNj
— Kolusu Parthasarathy (@kpsarathyTDP) December 15, 2024
వివరణ ఇవ్వాలని ఆదేశం..
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత ఎలా పాల్గొన్నారంటూ? మంత్రి ఎమ్మెల్యేపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారథి, గౌతు శిరీషను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం.