/rtv/media/media_files/2025/10/22/mp-sana-satish-2025-10-22-20-46-58.jpg)
తునిలో గురుకుల పాఠశాల విద్యార్థినీపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై రాజ్యసభ ఎంపీ సానా సతీష్ స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినికి జరిగింది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటిక నారాయణరావు అనే వ్యక్తి తాతని అని చెప్పి బాలికను తోటకు తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆయన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఎంపీ సానా సతీష్ వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపినట్లు ఆయన చెప్పారు. అయితే బాలిక సురక్షితంగా ఉందని, ఆమెకు కావాల్సిన కౌన్సిలింగ్, ఇతర సహాయ సహకారలు అధికారులు అందిస్తున్నట్లు ఎంపీ నిర్థారించుకున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిని రాజీపడకుండా కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో తుని అత్యాచారయత్న ఘటన సంచలనంగా మారింది. మాయమాటలు చెప్పి ఓ బాలికను తోటకు తీసుకెళ్లిన ఘటన స్థానికుల వీడియోతో బయటకు వచ్చింది.
దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో కూటమి ప్రభుత్వం నీచానికి ఒడిగట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది.